News January 2, 2025
కావలి: ఆశ్రయం కల్పిస్తే.. చంపేశాడు
కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్‌కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్‌గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News January 22, 2025
రేపు నారా లోకేశ్ జన్మదిన వేడుకలు.. భారీ కేక్ కట్టింగ్
నారా లోకేశ్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించనున్నారు. లోకేశ్ 42వ జన్మదిన సందర్భంగా లోకేశ్ చిత్రపటంతో 42 కేజీల కేక్ తయారు చేయించి రేపు కట్టింగ్ సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొననున్నారు.
News January 22, 2025
కాకాణిపై మరో కేసు నమోదు.. పదికి చేరిన కేసుల సంఖ్య
నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కావలిలో మరో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పోలీసులపై అనుచితంగా మాట్లాడారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటికే వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, కావలి ప్రాంతాలలో కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు పది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
News January 22, 2025
బుచ్చి మండలంలో అమానుష ఘటన
ఓ కసాయి తండ్రి తన బిడ్డలను అమ్ముకున్న ఘటన బుచ్చి(M) మినగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. పేడూరు రవి, వెంకమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మొదటగా పుట్టిన మగ బిడ్డను ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలకు అమ్మేశారు. రెండు రోజుల క్రితం మరో మగ బిడ్డను రవి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్మాడని వెంకమ్మ తెలిపింది. దీంతో సర్పంచ్ పూజిత ఎంపీడీవో శ్రీహరికి ఫిర్యాదు చేశారు.