News February 10, 2025
కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!

కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.
Similar News
News March 28, 2025
చాకిచర్ల సచివాలయం వ్యవహారంపై ఆరా తీసిన కలెక్టర్..

మండలంలోని చాకిచర్ల సచివాలయం వివాదాస్పద వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరినట్లు MPDOవిజయ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ వ్యక్తి సచివాలయం తాళం తీసి లోపలికి వెళ్ళడం.. దానిని పసిగట్టిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీసిన వైనం గురించి way2news లో ‘తాళం ఎందుకు తీశారు’.? అంటూ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపుతున్నట్లుMPDO చెప్పారు
News March 27, 2025
నెల్లూరు: హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో అనంతసాగరం ఏసీ మెకానిక్ హమీద్ (29) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 27, 2025
ఆత్మకూరు హైవే పక్కన అస్థిపంజరం లభ్యం

ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అల్లిపురం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని పూర్తిగా ఎముకల గూడుగా ఉన్న అస్థిపంజరం లభ్యమయింది. ఈ అస్థిపంజరం మగ వ్యక్తిదని, చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 58-60 ఏళ్ల మధ్య ఉండొచ్చని ఆత్మకూరు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా ఈ శవం ఆనవాళ్లను గుర్తిస్తే 9440796390 నంబరుకు వివరాలు తెలియజేయాలని SI కోరారు.