News June 13, 2024

కావలి: కొత్తరకం దొంగతనం!

image

సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి బంగారు గొలుసులు, బ్యాగులను దోచుకున్న ఘటన శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి గుడివాడకు చెందిన వి.నిర్మల మెడలోని బంగారు గొలుసును, పద్మకు చెందిన బ్యాగును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా తిరుపతి స్పెషల్ రైలులో ప్రయాణికుడు పాపారావుపై దాడి చేసి అతని భార్య మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లారు.

Similar News

News February 23, 2026

నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

image

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.

News February 22, 2026

నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

image

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.

News February 22, 2026

నెల్లూరు: మల్టీప్లెక్స్‌ల్లో “తెరచాటు” దోపిడి!

image

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్‌లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్‌లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.