News June 13, 2024
కావలి: కొత్తరకం దొంగతనం!

సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి బంగారు గొలుసులు, బ్యాగులను దోచుకున్న ఘటన శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి గుడివాడకు చెందిన వి.నిర్మల మెడలోని బంగారు గొలుసును, పద్మకు చెందిన బ్యాగును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా తిరుపతి స్పెషల్ రైలులో ప్రయాణికుడు పాపారావుపై దాడి చేసి అతని భార్య మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లారు.
Similar News
News March 20, 2025
నెల్లూరు: 10 మంది టీచర్లు సస్పెండ్

Open 10th Examsలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.
News March 20, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నెల్లూరు జిల్లా వాసి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
నెల్లూరు: గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి

నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ సుకన్య బుధవారం గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.