News September 8, 2024
కావలి: మత్తులో వ్యక్తి వీరంగం
కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
Similar News
News October 10, 2024
టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్ర్భాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుని వేడుకున్నారు.
News October 9, 2024
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి: నెల్లూరు SP
కస్టమ్స్, CBI, ED, ఏసీబీ అధికారులమని చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ సూచించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
News October 9, 2024
నెల్లూరు: క్రికెట్ ఆడటానికి వెళ్తూ యువకుడి మృతి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన ప్రసాద్ కుమారుడు కార్తిక్(19) తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడటానికి బైకుపై విద్యానగర్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో HP పెట్రోల్ బంక్ వద్ద బైకు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తలకు పెద్ద గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.