News February 6, 2025
కావలి DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఆశ్రయించారు.
Similar News
News October 17, 2025
రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
News October 17, 2025
పంపకాల్లో తేడాలతోనే విమర్శలు: కాకాణి

రేషన్ అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే TDP నేతలు పరస్పం విమర్శలు చేసుకుంటున్నారని వైసీపీ నేత కాకాణి అన్నారు. నకిలీ మద్యం, రేషన్ ఇలా రోజుకొక అవినీతి కూటమి ప్రభుత్వంలో బయటపడుతుందన్నారు. దీని వెనుక TDP నేతలు ఉన్నారని Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల దీనిపై విచారణ చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని ఆయన ఆరరోపించారు.
News October 17, 2025
నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.