News March 3, 2025

కాశీకి వెళ్లి మురిమడుగు మహిళా మృతి

image

ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి జన్నారం మండలంలోని మురిమడుగు మహిళ బోర్లకుంట రాజవ్వ మృతి చెందింది. 11 రోజుల క్రితం రాజవ్వ కుంభమేళాలో భాగంగా కాశీకి వెళ్లి శివున్ని దర్శించుకుంది. అనంతరం రాజవ్వ హఠాత్తుగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం మణికర్ణిక ఘాట్‌లో రాజవ్వ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేశారు.

Similar News

News January 8, 2026

తిరుపతికి వచ్చే ప్రయాణికులకు శుభవార్త….!

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా కొన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి-సికింద్రాబాద్ (12763) రైలు ఈనెల7 నుంచి 20వ తేదీ వరకు చర్లపల్లి స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగుతుంది. అలాగే సికింద్రాబాద్- తిరుపతి (12732), తిరుపతి- సికింద్రాబాద్ (12731) రైళ్లు ఏప్రిల్ 30వ తేదీ వరకు లింగంపల్లి స్టేషన్‌లో స్టాపేజీ కలిగి ఉంటాయి.

News January 8, 2026

సీఎం కప్ క్రీడా పోటీలకు అవగాహన ర్యాలీ ప్రారంభం

image

సీఎం కప్ క్రీడా పోటీలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రవి క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ అశోక్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజిజ్ ఖాన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వరద రాజేశ్వరరావు, సారంగపాణి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు.

News January 8, 2026

Ashes: చివరి టెస్టులో ఆసీస్ విజయం

image

ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ చివరి(5వ) టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. 160 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టులో లబుషేన్ 37, వెదర్లాండ్ 34, హెడ్ 29 రన్స్ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఇంగ్లండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.