News March 14, 2025

కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించండి: పురందరేశ్వరి

image

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ఢిల్లీలో కలిశారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు. జ్యోతి క్షేత్రం, కాశీనాయన ఆశ్రమం రాయలసీమలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని లేఖలో వెల్లడించారు. కాగా బద్వేలులో కాశీనాయన ఆశ్రమాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

News March 24, 2025

క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

image

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

News March 24, 2025

విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

image

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు. 

error: Content is protected !!