News September 6, 2024

కాశీబుగ్గలో ఉపాధ్యాయునికి కుచ్చు టోపీ

image

కాశీబుగ్గలో ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆయన కుమారుడు భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ‘గురువారం ఉదయం నాకు ఫోన్ చేసి, నా కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని చెప్పారు. తాము పోలీసులమని పనిచేస్తున్నామని డబ్బిస్తే కేసు నుంచి తప్పిస్తామన్నారు. రూ.1.90 లక్షలు పంపించాను. ఇంకా రూ.50 వేలు పంపమన్నారు. అనుమానంతో ఆ నంబరకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది’.

Similar News

News September 14, 2024

SKLM: సెబ్ కానిస్టేబుల్ విజయ్‌పై వేటు

image

భార్య అనూష మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సెబ్ డీఎస్‌ఈవో తిరుపాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. సెబ్ కానిస్టేబుల్ అనూష మృతిచెందిన ఘటనలో విజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

News September 14, 2024

SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి

image

నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

News September 14, 2024

శ్రీకాకుళం: అధ్వానంగా రోడ్డు

image

శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.