News June 17, 2024

కాశీబుగ్గలో ఫ్లెక్సీ ఏర్పాటు.. పోలీసుల విచారణ

image

గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌కు చెందిన అద్దెలు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, అంబి సాంబరాజు, కాంగ్రెస్ నాయకులు దాసరి రాజేశ్, కూచన రవీందర్ తదితరులను పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారించారు.

Similar News

News November 19, 2025

వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

image

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.

News November 19, 2025

పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పంపిణీని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోగా, పట్టణాల్లో మార్చి 1-8 మధ్య పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు.

News November 16, 2025

WGL: ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.