News June 17, 2024
కాశీబుగ్గలో ఫ్లెక్సీ ఏర్పాటు.. పోలీసుల విచారణ

గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌కు చెందిన అద్దెలు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, అంబి సాంబరాజు, కాంగ్రెస్ నాయకులు దాసరి రాజేశ్, కూచన రవీందర్ తదితరులను పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారించారు.
Similar News
News January 17, 2026
WGL: పరిశ్రమలతో 6,810 మందికి ఉపాధి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇప్పటికి 48 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.380.53 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,810 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.
News January 17, 2026
వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
News January 13, 2026
వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.


