News February 11, 2025
కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పీటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 23, 2025
నల్గొండ: ‘అధికారం కోల్పోయాక KTRకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరం’

అధికారం కోల్పోయాక కేటీఆర్, హరీశ్రావుకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరమని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత మండిపడ్డారు. వారి తీరు సురభి నాటకాలను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి,ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని,రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు.
News December 23, 2025
శరీరానికే వైకల్యం.. సంకల్పానికి కాదు: IESలో మానవేంద్ర వండర్!

శారీరక వైకల్యం అడ్డువచ్చినా, పట్టుదలతో భారతీయ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షలో 112వ ర్యాంక్ సాధించారు మానవేంద్ర సింగ్. తండ్రి చనిపోయినా, తల్లి రేణు సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు UPలోని బులంద్షహర్కు చెందిన ఈ కుర్రాడు. పట్నాలో బీటెక్ చేస్తుండగానే IES ఆఫీసర్ కావాలని కలలు కన్నారు. ఇప్పుడు అది నిజం కావటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మానవేంద్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
News December 23, 2025
బాపట్ల: అలర్ట్.. షెడ్యూల్ విడుదల..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2026 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.


