News April 24, 2024
కాసాని జ్ఞానేశ్వర్కు రూ.30 లక్షల అప్పు

చేవెళ్ల BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు.. జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతంగా వాహనాలు లేకపోగా.. ఆయన భార్యకు 4 కార్లు ఉన్నాయి. వీరి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30 లక్షల అప్పు ఉంది.
Similar News
News November 13, 2025
నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 13, 2025
‘నిలోఫర్’ సమస్యలంటే సర్కారుకు చులకనే..!

నిలోఫర్ అస్పత్రి అంటే అదో ధైర్యం.. అక్కడ వైద్యానికి వెళ్తే పిల్లలకేం కాదనేది ఓ నమ్మకం. అయితే నిలోఫర్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మొరాయించే లిఫ్టులు పేషెంట్లకు నరకం చూపిస్తాయి. ఇక వెయిటింగ్ హాల్ ప్రారంభం కాక అలాగే ఉండిపోయింది. రోజూ 1,200 నుంచి 1,500 ఓపీ నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా ఇక్కడ బెడ్స్ సమస్య చిన్నారులను వేధిస్తోందని పేరెంట్స్ వాపోతున్నారు.


