News July 25, 2024

కాసిపేటలో మహిళ దారుణ హత్య

image

మహిళను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. లంబడి తండా గ్రామానికి చెందిన అజ్మీరా నీలా (45) భర్త 15 ఏళ్ల క్రితం మరణిచడంతో గాండ్ల రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రవి స్నేహితుడు అంబరావు బుధవారం రవి లేని సమయంలో నీలా పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News October 22, 2025

ADB: పత్తి రైతులకు శుభవార్త

image

పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన 8 శాతంలోపు తేమతో కూడిన పత్తి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర 8110 పొందాలని పేర్కొన్నారు.

News October 21, 2025

రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమన్నారు. తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌‌లో తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

News October 20, 2025

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

image

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.