News August 10, 2024
కాసిపేట: కూతురి మృతిపై అనుమానం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

తన కూతురు రోషిని మృతిపై అనుమానం ఉందని తండ్రి తిరుపతి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కాసిపేట మండలం స్టేషన్ పెద్దనపల్లికి చెందిన వెంకటేష్‌తో రోషినికి 3ఏళ్ల క్రితం వివాహం చేశారు. రోషినికి జ్వరం రాగా భర్త వెంకటేశ్ బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News February 27, 2026
ఆదిలాబాద్: హత్య కేసులో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

ఆదిలాబాద్ పట్టణంలో 2022 జూలై 13న జరిగిన గొడవలో గుడ్ల సాయికుమార్‌ను పదునైన ఆయుధంతో హత్య చేసిన అంబేడ్కర్ నగర్‌కు చెందిన తోరట్ ప్రీతమ్(36)పై వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 24 మంది సాక్షులను విచారించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు నిందితునికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.
News February 27, 2026
ఆదిలాబాద్: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 491 గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా మొత్తం 9,226 మంది విద్యార్థులకు 8,735 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 8,204 మందికి 366 మంది విద్యార్థులు, వొకేషనల్ విభాగంలో 1,022 విద్యార్థులకు 125 మంది విద్యార్థులు, మొత్తం 491 మంది ఎగ్జామ్‌కు గైర్హాజరైనట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ వెల్లడించారు.
News February 27, 2026
ఆదిలాబాద్: MAR 10న మెగా JOB మేళా..!

పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతోపాటు ఆదివాసీ యువత అభివృద్ధి కోసం MAR 10న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మెగా JOB మేళా నిర్వహించనుండటం అభినందనీయమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాబ్ మేళా పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీల ద్వారా 2వేలకుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE.


