News August 10, 2024
కాసిపేట: కూతురి మృతిపై అనుమానం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు
తన కూతురు రోషిని మృతిపై అనుమానం ఉందని తండ్రి తిరుపతి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కాసిపేట మండలం స్టేషన్ పెద్దనపల్లికి చెందిన వెంకటేష్‌తో రోషినికి 3ఏళ్ల క్రితం వివాహం చేశారు. రోషినికి జ్వరం రాగా భర్త వెంకటేశ్ బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News September 11, 2024
మంచిర్యాలలో వ్యభిచారం
మంచిర్యాల పట్టణంలో ఇటీవల వ్యభిచారం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువతులు, ఇద్దరు బాలికలు, ఆరుగురు విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా నిర్వాహకులు భార్యాభర్తలని పోలీసులు వెల్లడించారు.
News September 11, 2024
నిర్మల్: గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఘటన నిర్మల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసినట్లు CI రామకృష్ణ తెలిపారు.
News September 11, 2024
ఆదిలాబాద్: 13న ఇంటర్వ్యూ.. 20 వేల జీతం
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్)లలో ఈనెల 13న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. UpGrad వారి సహకారంతో HDFC Bank లలో శాశ్వత ప్రాతిపదికన బ్యాంకులలో నెలకు 20,000 పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ /బిటెక్ లో 50% మార్కులు కలిగి ఉండి 30 సం.రాల లోపు వయసు ఉన్నవారు అర్హులని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.