News August 10, 2024
కాసిపేట: జ్వరంతో ఎనిమిది నెలల గర్భిణి మృతి
కాసిపేట మండలంలోని రేగులగూడెంకు చెందిన గెడెం పార్వతి (22) 8 నెలల గర్భిణి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పార్వతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో మంచిర్యాల మాతా శిశు కేంద్రం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News September 17, 2024
SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు
కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 17, 2024
కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.
News September 16, 2024
రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.