News April 12, 2024
కాసిపేట: పాము కాటుతో వృద్దుడు మృతి

కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన చొప్పరి బాలయ్య అనే వృద్దుడు పాము కాటుతో మృతి చెందాడు. మృతుడు దుబ్బగూడెం సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలయ్యను చూసిన కొందరు కుటుంబీకులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Similar News
News March 17, 2025
ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.
News March 17, 2025
ఆదిలాబాద్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి K.ప్రభాకర్ రావు, అదనపు డిస్ట్రిక్ట్ సెక్షన్స్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు. రానున్న లోక్ అదాలత్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.
News March 17, 2025
ఆదిలాబాద్: నేడు, రేపు వడగాలులు

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.