News June 4, 2024
కాసేపట్లో గుంటూరు వెస్ట్ ప్రజల తీర్పు.!

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి ఓటేశారో కాసేపట్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సిద్ధమవగా.. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ TDP నుంచి గల్లా మాధవి, YCP నుంచి విడదల రజిని బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మద్దాలి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఈ సారి ఎవరు గెలవనున్నారో లైవ్ అప్డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.