News June 4, 2024

కాసేపట్లో గుంటూరు వెస్ట్ ప్రజల తీర్పు.!

image

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి ఓటేశారో కాసేపట్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సిద్ధమవగా.. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ TDP నుంచి గల్లా మాధవి, YCP నుంచి విడదల రజిని బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మద్దాలి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఈ సారి ఎవరు గెలవనున్నారో లైవ్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News September 10, 2024

తుళ్లూరు: బాలికను గర్భవతి చేసిన పాస్టర్.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను గర్భవతి చేసిన పాస్టర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుళ్లూరు మండలం వెంకటపాలెంకి చెందిన కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15ఏళ్ల బాలికపై పాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News September 10, 2024

రెంటచింతలలో వినాయక లడ్డూ వేలం రూ.7.10 లక్షలు

image

రెంటచింతల మండల కేంద్రంలోని ఆనంద్ పేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో రూ.7.10 లక్షలు పలికింది. మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి తండ్రి ఆదిరెడ్డి కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా లడ్డును ఆదిరెడ్డికి అందజేశారు.

News September 10, 2024

గడువులోగా సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

image

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.