News September 8, 2024
కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు ఉందని, పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 2.75, ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు రాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు వస్తుందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 15, 2024
గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
News October 14, 2024
అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ఉత్తర్వులు
అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
News October 14, 2024
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కొరకు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.