News August 13, 2024
కాసేపట్లో షార్కు పవన్ కళ్యాణ్.. అంతా అప్రమత్తం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి వెళ్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. షార్లోని ఒకటి, రెండు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఇప్పటికే కాన్వాయ్ రిహార్సల్ చేపట్టారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.