News October 2, 2024
కాస్త ఓపిక పట్టు కేతిరెడ్డీ.. నీ గుట్టు విప్పుతా: మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత మీకు సరిగ్గా వర్తిస్తుంది కేటురెడ్డీ.. కబ్జా కమీషన్, కలెక్షన్ కరప్షన్లకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. కమీషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. కాస్త ఓపిక పట్టు నీ దారుణాలు గుట్టు విప్పుతా’ అంటూ ఘాటుగా స్పందించారు.
Similar News
News October 15, 2025
అనంతలో కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన

కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే అనంతపురం నగరానికి విచ్చేశారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రజా సమస్యలపై సింధూర అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలన్నారు.
News October 14, 2025
స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్‌లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
News October 14, 2025
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.