News February 23, 2025
కింజరాపు ఎర్రన్నాయుడుది మచ్చ లేని చరిత్ర : CM

దివంగత మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి నేడు. దీనిపై CM ట్విటర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.’ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు గారు.మూడు దశాబ్దాలకు మించి రాజకీయ చరిత్రలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం!’అని తన Xఖాతాలో రాసుకొచ్చారు.
Similar News
News February 24, 2025
అరసవల్లి ఆదిత్యుని ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,09,600లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,34,906/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,51,675/-లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
News February 23, 2025
టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 23, 2025
ఆమదాలవలస : వెలవెలబోతున్న చికెన్ షాపులు

జిల్లాలోని బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ షాపులు వెల వెల పోతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్ వినియోగం తగ్గడం వలన ఆమదాలవలసలో కేజీ స్కిన్ లెస్ రూ .150/- గా ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ లేకపోయినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.