News August 10, 2024
కిడ్నాప్ కేసు.. కర్నూలులో వైసీపీ నేత అరెస్ట్

కర్నూలులో సంచలనం సృష్టించిన వ్యాపారి ప్రవీణ్ కుషాల్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేతతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రవీణ్‌ను కిడ్నాపర్లు బలవంతంగా అపహరించారు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పెద్ద మద్దిలేటి ఆయన అనుచరులు అనిల్, సురేశ్, భాస్కర్, మిథున్‌ను అరెస్ట్ చేశారు. కోడుమూరు MLA టికెట్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది.
Similar News
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.


