News January 31, 2025

కిడ్నీ మార్పిడి మోసం.. కర్నూలులో నిందితుడి అరెస్ట్

image

కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సి.బెళగల్ మం. మారందొడ్డికి చెందిన గాగప్ప తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో పొన్నకల్లు గ్రామానికి చెందిన నరసింహుడు తాను అనస్థీషియా పనిచేస్తున్నానని, కిడ్నీ మార్పిడి చేయిస్తానంటూ నమ్మబలికాడు. ఈయన మాయమాటలు నమ్మిన నాగప్ప రూ.3.15లక్షలు చెల్లించాడు. అప్పటి నుంచి నిందితుడు ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 10, 2025

కర్నూలు జిల్లా న్యూస్ రౌండప్

image

☞ నేడు కర్నూలులో ప్రజా పరిష్కార వేదిక
☞ గీత కులాల మద్యం షాపులకు నేడు లాటరీ
☞ 6,42,391 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
☞ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 659 మందిపై కేసులు
☞ రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన 23ఏళ్ల యువకుడి మృతి
☞ శ్రీరంగాపురంలో నేడు ఆరాధన
☞ చెట్నిహళ్లిలో మళ్లీ వివాదం.. అంత్యక్రియల అడ్డగింత
☞ నేడు శ్రీశైలానికి ఐదుగురు మంత్రుల బృందం

News February 10, 2025

కర్నూలు జిల్లాలో 6,42,391 మందికి ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

image

కర్నూలు జిల్లాలో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధమైంది. నేడు జాతీయ నులి పరుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 6,42,391 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మింగించేలా ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో డా.శాంతికళ తెలిపారు.

News February 10, 2025

పెళ్లి పేరుతో మోసం.. కర్నూలులో మహిళపై కేసు

image

పెళ్లి పేరుతో భారీగా డబ్బు తీసుకుని కర్నూలు వ్యక్తిని ఓ మహిళ మోసం చేసింది. పోలీసుల వివరాల మేరకు.. గద్వాల జిల్లా చింతకుంటకు చెందిన అబ్దుబ్ బి అనే మహిళ పెళ్లి పేరుతో రూ.17 లక్షలు తీసుకుని మోసం చేసిందని కల్లూరు ముజఫర్ నగర్‌కు చెందిన షేక్ కబీర్ బాషా కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిందితురాలిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

error: Content is protected !!