News April 14, 2025

కియాలో ఇంజిన్ల చోరీ.. దర్యాప్తు ముమ్మరం!

image

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిందే. ఈ ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ తన బృందంతో తమిళనాడుకు వెళ్లి పలువురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. కాగా 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.

Similar News

News January 19, 2026

ఏయూ పరిధిలో పరీక్షల వాయిదా

image

​ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ (PG), ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధించి జనవరి 20 నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. రివైజ్డ్ టైమ్ టేబుల్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు తెలిపారు.

News January 19, 2026

భూపాలపల్లి: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: కలెక్టర్

image

అభివృద్ధిలో గ్రామాలు రోల్ మోడల్‌గా నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లిలో జరిగిన సర్పంచుల శిక్షణలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రతి సర్పంచ్ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గాంధీజీ కన్న కలల ప్రకారం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గుర్తుచేశారు. సర్పంచులు టీమ్ వర్క్‌తో మౌలిక వసతులు కల్పించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 19, 2026

HYD: ఇరిగేషన్ సంతకం.. వేల కోట్ల వశం!

image

TDR జారీకి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అదనపు కలెక్టర్ క్లియరెన్స్ ఉండాలన్న నిబంధన ఇప్పుడు కొత్త పైరవీలకు కేంద్రమైంది. ఫైనల్ ఎఫ్టీఎల్ (FTL) నోటిఫికేషన్ లేని చెరువుల విషయంలో అధికారులదే అంతిమ నిర్ణయం కావడంతో ఎవరికి TDR ఇవ్వాలి? ఎవరికి ఆపాలి అన్నది? ‘నోట్ల’ కట్టలే నిర్ణయిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. TDR లావాదేవీలపై పబ్లిక్ ఆడిట్ లేకపోవడం ఈ అక్రమాలకు ప్రధాన ఊతంగా మారుతోంది.