News February 14, 2026

కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల దారి మళ్లింపు

image

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునీకీకరణ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ (58501) ప్యాసింజర్ ఈ నెల 16 నుంచి 27 వరకు దంతేవాడ వరకే నడువనుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖపట్నం (58502) రైలు 17 నుంచి 28 వరకు కిరండూల్‌కు బదులుగా దంతేవాడ నుంచే ప్రారంభమవుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే శాఖ కోరింది.

Similar News

News April 14, 2026

GNT: అమరావతి వరద నివారణ పనులకు టెండర్లు

image

రాజధాని అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ADCL చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

News April 14, 2026

రేపే లాస్ట్ డేట్.. APPLY NOW

image

TG: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే ‘TGRJC CET’కు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. MPC, BiPC, MEC, CECలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే 60వేల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తుకు అర్హులే. ఈ ప్రవేశ పరీక్ష మే 3న జరుగుతుంది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

News April 14, 2026

అన్ని వర్గాల హక్కుల ప్రదాత రాజ్యాంగ నిర్మాత: లోకేశ్

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.