News February 9, 2025

కిరణ్ రాయల్ వివాదానికి ఆ ఫొటోనే కారణమా?

image

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వివాదానికి రెండు రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్‌లో జగన్ 2.0 పోస్టర్‌ను రిలీజ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఫొటోతో మాజీ ముఖ్యమంత్రి హేళన చేయడం సహించలేని వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ ఫోన్ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన డేటాను అటు మీడియాకు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 8, 2026

కృష్ణా జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎదురుదెబ్బ..!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. మైలవరం, కంచికచర్ల సహా 4 మండలాల్లోని 18 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మార్కెట్ ధర చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. గత జూన్ నుంచి 3,300 ఎకరాలను నోటిఫై కింద ఉంచడంతో.. ఆస్తుల బదలాయింపులు, పిల్లల పెళ్లిళ్లకు భూమి అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 8, 2026

ఫోలిక్ యాసిడ్ అందరికీ అవసరమే

image

ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాక అందరికీ అవసరమేనంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఫోలిక్ యాసిడ్ వల్ల పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, చిక్కుడు జాతి గింజ‌లు, ప‌ప్పులు, సిట్రస్ ఫ్రూట్స్, ట‌మాటా, మ‌ట‌న్ లివ‌ర్‌, బ్రౌన్ రైస్‌, ప‌ల్లీలు, పుట్ట‌గొడుగులు, బొప్పాయి, క్యారెట్లు, బీట్ రూట్‌, ప‌చ్చి బ‌ఠానీల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

News February 8, 2026

చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

image

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.