News March 1, 2025
కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2025
జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.
News March 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 3, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 3, 2025
గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.