News March 1, 2025

కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 25, 2025

రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

image

AP: రేపు రాష్ట్రంలోని <>108 మండలాల్లో<<>> వడగాలుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ నంద్యాల (D) రుద్రవరంలో 41.6°C, ప్రకాశం (D) దరిమడుగులో 41.1°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. 15 మండలాల్లో వడగాలులు వీచాయంది. మరోవైపు అకాల వర్షం వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద నిలబడొద్దని చెప్పింది.

News March 25, 2025

ఒంగోలు: మాజీ సీఎం జగన్‌తో జిల్లా వైసీపీ నేతల సమావేశం

image

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్‌ను కలిశారు. జిల్లా నాయకులతో వైసీపీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దద్దాల నారాయణ ఉన్నారు.

News March 25, 2025

రేపు విజయవాడకి రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకి రానున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎమ్మెల్సీ రుహుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ సీఎం జగన్ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.

error: Content is protected !!