News March 23, 2025

కిర్లంపూడి: పాము కాటుకు కౌలు రైతు మృతి

image

పొలం పనికి వెళ్లి పాము కరవడంతో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన అనపర్తి కృష్ణ (56) అనే కౌలు రైతు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు శుక్రవారం ఉదయం కృష్ణ పొలం పనికి వెళ్లగా పాము కాటు వేయడంతో స్పృహా తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడాన్నారు.

Similar News

News October 28, 2025

కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

image

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

News October 28, 2025

గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావం

image

మంగళగిరి కొత్తపేట, కొలకలూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమవారం మోస్తరుగా వర్షం కురిసింది. తుపానుతో గాలి వేగం పెరిగి, చలి ఎక్కువగా ఉంది. పూరి గుడిసెలు, శిథిల భవనాలు ఖాళీ చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పర్యటనలో ప్రమాదం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, ప్రజలు ఇళ్లలో ఉండాలని, అవసరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

News October 28, 2025

అత్యవసర సమయాల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 24×7 కమాండ్ కంట్రోల్ రూమ్ (8333813228) ఏర్పాటు చేశామన్నారు. చీరాల సబ్‌డివిజన్ – ఎస్‌ఐ వి.నాగ శ్రీను (9121104793), బాపట్ల ఎస్‌ఐ ఎం.విజయ్ కుమార్ (8978777298), రేపల్లె సీసీ డీఎస్పీ పి.రవి ప్రసాద్ (9032030919) ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు.