News March 23, 2025
కిర్లంపూడి: పాము కాటుకు కౌలు రైతు మృతి

పొలం పనికి వెళ్లి పాము కరవడంతో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన అనపర్తి కృష్ణ (56) అనే కౌలు రైతు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు శుక్రవారం ఉదయం కృష్ణ పొలం పనికి వెళ్లగా పాము కాటు వేయడంతో స్పృహా తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడాన్నారు.
Similar News
News July 8, 2025
కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.
News July 8, 2025
ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.