News February 4, 2025
కిలో టమాటా రూ.14, టన్ను చీనీ రూ.19వేలు

అనంతపురంలో టమాటా ధరలు రైతులకు నిరాశే మిగిలిస్తున్నాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.14 పలికింది. సరాసరి ధర రూ.11, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు కూడా భారీగా పడిపోయాయి. నిన్న టన్ను గరిష్ఠంగా కేవలం రూ.19వేలతో అమ్ముడయ్యాయి. కనిష్ఠంగా రూ.8వేలు పలికాయి.
Similar News
News February 14, 2025
FDPలు బోధన సిబ్బందికి ఎంతో ఉపయోగపడతాయి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని గురువారం వాధ్వానీ ఫౌండేషన్ వారు సందర్శించారు. అనంతరం జేఎన్టీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను(FDP) నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బోధన సిబ్బందికి FDPలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య పాల్గొన్నారు.
News February 13, 2025
క్రమబద్ధీకరణ పథకం కింద తొలి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.
News February 13, 2025
తాడిపత్రిలో శివలింగం కింద నీటిని ఎప్పుడైనా చూశారా!

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.