News April 28, 2024

కిలో పొగాకుకు రికార్డ్ ధర

image

మునుపెన్నడూ లేని విధంగా వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. గోపాలపురం పొగాకు బోర్డులో కిలో రూ.341కు అమ్ముడయింది. దీంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కనిష్ఠ ధర రూ.235గా ఉంది. మొత్తం 1201 బేళ్లు అమ్మకానికి రాగా.. 980 అమ్ముడయ్యాయన్నారు . ఈ ఏడాది కొనుగోలు ప్రారంభంలో కిలో పొగాకు రూ.240 పలకడంతో రైతులు నిరాశ చెందారు. తాజాగా ఊహించని రీతిలో ధర పెరగడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

నరసాపురం: ‘లోక్ అదాలత్‌పై దృష్టి సారించాలి’

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.

News November 1, 2025

భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

image

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.