News February 26, 2026

కివీస్ విక్టరీ.. పాకిస్థాన్‌కు భారీ షాక్!

image

T20 WC: శ్రీలంకపై <<19240092>>న్యూజిలాండ్<<>> భారీ విజయం సాధించడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. కివీస్ గెలుపు పాక్ సేనకు గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇప్పుడు పాక్ ముందడుగు వేయాలంటే.. ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్ భారీ తేడాతో ఓడిపోవాలి. తర్వాత పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకను అత్యధిక రన్ రేట్‌తో ఓడించాలి. ఒకవేళ ENGపై కివీస్ గెలిచినా లేదా ఆ మ్యాచ్ వర్షంతో రద్దయినా పాక్ ఆశలు గల్లంతైనట్టే.

Similar News

News April 14, 2026

‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే డిజిటల్ రైట్స్‌ కోసం పెద్ద డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రైట్స్‌కు రూ.250 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News April 14, 2026

ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ కాస్తోంది. ఏపీలోని కడపలో నిన్న అత్యధికంగా 44.4 డిగ్రీలు, తెలంగాణలోని నిజామాబాద్‌లో 42.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ్టి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించాయి.

News April 14, 2026

కుర్రాళ్లు కుమ్మేశారు!

image

‘SRH 200కు పైగా స్కోర్ చేసినా కాపాడుకోలేదు’ ఇదీ మొన్నటివరకు ఆ జట్టుపై అభిప్రాయం. టాప్ క్లాస్ బౌలర్లు లేకపోవడం అందుకు కారణం. నిన్న అనూహ్యంగా ఆ జట్టు సీనియర్లు ఉనద్కత్, హర్షల్ పటేల్‌ను పక్కనపెట్టి ప్రఫుల్(24), హుస్సేన్‌(21) తీసుకొచ్చింది. గత 4 మ్యాచుల నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్లు అద్భుతమైన <<19643234>>ప్రదర్శనతో<<>> అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కదా SRHకు కావాల్సిన బౌలింగ్ అని అనుకునేలా చేశారు.