News January 27, 2025
కిసాన్దాస్పేటలో చోరీ విఫలయత్నం

ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేటలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించగా విఫలమైనట్లు స్థానికులు తెలిపారు. సత్తవ్వ అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కట్టెలతో ఆమె తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ శబ్దానికి సత్తవ్వ కేకలు వేసింది. చుట్టుపక్కల సుమారు పదిమంది యువకులు వచ్చి కట్టెలతో వారిని తరిమికొట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.
News December 7, 2025
అనకాపల్లి జిల్లా స్థాయిలో ఈనెల 8న ఆటల పోటీలు

జిల్లాలో 18 ఏళ్లు పైబడిన గిరిజనులకు ఈనెల 8న రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శైలజ శనివారం తెలిపారు. అనకాపల్లి NTR స్టేడియంలో కబడ్డీ, డెమో గేమ్, పరవాడ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో ఆర్చరీ నిర్వహిస్తారన్నారు. పెసా రన్ మారథాన్ (21.5 కి.మీ) రేబాక-దేవిపురం వరకు ఉంటుందన్నారు. గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News December 7, 2025
నేటి ముఖ్యాంశాలు

✸ జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు
✸ TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి
✸ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి
✸ కొడుకు, అల్లుడు, బిడ్డే KCRను ముంచుతారు: రేవంత్
✸ రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల
✸ 95% ఫ్లైట్ కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో
✸ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా


