News March 8, 2025

కీటక జనిత వ్యాధుల నియంత్రణపై విశాఖలో శిక్షణ

image

విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శుక్రవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు సుభ్రమన్యేశ్వరి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ శుక్రవారం డ్రైడే -ఫ్రై డే పాటించాలన్నారు. యాంటీ లార్వా పద్ధతులు ద్వారా దోమల నిర్మూలన చేయాలన్నారు. నీరు నిల్వ లేకుండా, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. DMHO జగదీశ్వరావు ఉన్నారు.

Similar News

News December 19, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 168 మంది గైర్హాజరు

image

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.

News December 19, 2025

విశాఖ: ‘పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు’

image

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామన్నారు.

News December 19, 2025

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర (SASA) ప‌క్కాగా నిర్వ‌హించాలి: విశాఖ కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 3వ శనివారం విశాఖలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అంశంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాల‌ని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGలు), స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారులు అభివృద్ధి చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించాల‌న్నారు.