News February 25, 2025
కీసరగుట్టకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర సందర్భంగా TGSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, సోమవారం కీసరగుట్ట బస్ ప్రయాణ ప్రాంగణంలో జాతర స్పెషల్ క్యాంప్‌ను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం కుషాయిగూడ కంటోన్మెంట్ హకీంపేట ఉప్పల్, చెంగిచెర్ల డిపో నుంచి ECIL భక్తుల సౌకర్యార్థం, సికింద్రాబాద్ స్టేషన్, ఘట్కేసర్‌లలో ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు.
Similar News
News March 19, 2025
అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.
News March 19, 2025
కవిటిలో యువకుడిపై పోక్సో కేసు నమోదు

సొంత మేనమామ పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కవిటి మండలంలోని రాజపురం పంచాయతీ తొత్తిపుట్టుగలో మార్చి11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్యాయంగా చూడాలస్సిన మేనమామ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నొప్పి భరించలేక బాలిక కేకలు పెట్టడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటనపై డీఎస్పీ వెంకట అప్పరావు కేసు నమోదు చేశారు.
News March 19, 2025
భద్రాద్రి: మైనర్‌పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.