News February 26, 2025

కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

image

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్‌ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

HYD: ఆస్తిపన్ను వడ్డీపై 90% రాయితీ అందుకే!

image

2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించే వారికి GHMC బకాయిల వడ్డీలపై 90% రాయితీ ప్రకటించింది. గతంలో ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. 2022-23లో రూ.170 కోట్లు, 2023- 24లో రూ.320 కోట్లు, 2024-25లో రూ.466 కోట్లుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ సదుపాయం ఉంటుంది.
# SHARE IT

News December 23, 2025

3నెలల్లో భాగ్యలతలో FOB: మంత్రి కోమటిరెడ్డి

image

NH65పై మృత్యుఘోషకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. భాగ్యలత వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB)ని 3నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హయత్‌నగర్ వద్ద యజమానుల మొండితనం, కోర్టు స్టేతో రోడ్డు విస్తరణకు లేట్ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం.. బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయండి’ అని అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు Way2Newsతో తెలిపారు.

News December 23, 2025

మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

image

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.