News January 28, 2025
కీసర గుట్ట జాతర తేదీల ప్రకటన

ప్రసిద్ధి చెందిన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం జాతర తేదీలను ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, EO సుధాకర్ రెడ్డి ప్రకటించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24న విఘ్నేశ్వర పూజ, 25న స్వామివారి కళ్యాణం, 26న మహా శివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 27న విమాన రథోత్సవం, 28న వసంతోత్సవం, పుష్పయాగం, మార్చి 1న పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు తెలుపుతూ కరపత్రాలు విడుదల చేశారు. SHARE IT
Similar News
News February 25, 2026
ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
News February 25, 2026
NGKL: ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్ ALL THE BEST

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
News February 25, 2026
నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.


