News January 28, 2025

కీసర గుట్ట జాతర తేదీల ప్రకటన 

image

ప్రసిద్ధి చెందిన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం జాతర తేదీలను ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, EO సుధాకర్ రెడ్డి ప్రకటించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24న విఘ్నేశ్వర పూజ, 25న స్వామివారి కళ్యాణం, 26న మహా శివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 27న విమాన రథోత్సవం, 28న వసంతోత్సవం, పుష్పయాగం, మార్చి 1న పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు తెలుపుతూ కరపత్రాలు విడుదల చేశారు. SHARE IT

Similar News

News February 15, 2025

KMR: లైంగిక దాడులను అరికట్టాలి: అదనపు కలెక్టర్

image

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్‌కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

News February 15, 2025

అమ్మడు లైనప్ అదిరిందిగా!

image

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. రామ్ పోతినేని సరసన RAPO22, దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో ఆమె కనిపిస్తారని సమాచారం. దీంతో ఈ అమ్మడి లైనప్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News February 15, 2025

మెడికల్ కళాశాల సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్

image

అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలను కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం సందర్శించారు. అనాటమీ, వయ కెమిస్ట్రీ, హిస్టాలజీ ల్యాబ్ బోధనా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సామాజిక సేవ క్లబ్, సాంస్కృతి కార్యక్రమాల క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ 1 ఏప్రిల్‌లోను, బ్లాక్ 2 ఆగస్టు, బ్లాక్ 3 జూన్‌లోను పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.

error: Content is protected !!