News May 11, 2024
కుంటాల మండలంలో గుర్తు తెలియని మృతదేహం

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహనం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 50 నుంచి 55 సం.ల వయసు ఉంటుందని, నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535,8712659534 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News November 24, 2025
ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
News November 24, 2025
ADB: మనకే పదవి వస్తుందనుకున్నాం.. కానీ

డీసీసీ అధ్యక్షుల ఎంపికతో కాంగ్రెస్లో సీనియర్లు నిరాశకు లోనయ్యారు. తమకే పదవి వస్తుందని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని భావించారు. జిల్లాలో గోక గణేశ్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, ఆడే గజేందర్ వంటివారు అధ్యక్ష పీఠంపై కన్ను వేశారు. కానీ అధిష్టానం వారిని కాదని నరేశ్ జాదవ్కు బాధ్యతలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన నేతలు, వారి అభిమానులు నిరాశలో ఉన్నారు.
News November 23, 2025
OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్ రాజర్షి షా

కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రైతులు తమ సందేహాల నివృత్తికి 6300001597 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.


