News November 10, 2024

కుందుర్పి మండలంలో చిరుత కలకలం

image

కుందుర్పి మండలం జమ్ము గుంపుల పంచాయతీ పరిధిలోని కొలిమిపాలెం శివారులో శనివారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. దాని దాడిలో దూడ మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని వారు కోరుతున్నారు.

Similar News

News November 14, 2024

JNTUA: బీటెక్ 4వ సంవత్సరం పరీక్షలు వాయిదా

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి బీటెక్ 4వ సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ ప్రొ. నాగప్రసాద్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజుల కిందట నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు చేత తరగతులు జరగకపోగా.. ఇప్పటి నుంచి తరగతులను కాస్త పెంచుతూ DEC-4వ తేదీన జరగాల్సిన పరీక్షలను కూడా DEC-13వ తేదికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

News November 14, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్

image

పుట్టపర్తి మండల పరిధిలోని బడే నాయక్ తండాలో ప్రభుత్వ టీచర్ శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మద్యం తాగి పాఠశాలలో విధులకు హాజరవుతున్నారని, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను హెచ్చరించారు. తీరు మారకపోవడంతో చర్యలు తీసుకున్నారు.

News November 14, 2024

అనంతపురంలో ముగ్గురి అరెస్ట్.. 21 తులాల బంగారం స్వాధీనం

image

అనంతపురంలోని కృపానంద నగర్‌లో ఇటీవల చోరీ జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు చేధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.