News September 4, 2024
కుందూ నది వరద ఉద్ధృతి పరిశీలించిన ఎస్పీ
నంద్యాల మీదుగా ప్రవహిస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు, పట్టణంలో గల చెరువును మంగళవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. కుందూ నది, మద్దిలేరు వాగులలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఎస్పీ వాటిని పరిశీలించి వరద ఉద్ధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ DSP సంతోశ్, రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ ఉన్నారు.
Similar News
News September 7, 2024
పెన్సిల్ ముక్కపై వినాయకుడి చిత్రం
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పత్తికొండకు చెందిన కళాకారుడు హర్షవర్ధన్ తన ప్రతిభకు పనిచెప్పారు. పెన్సిల్ ముక్కపై వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. తన భక్తిని చాటుకున్నారు. మైక్రో ఆర్ట్ రూపంలో చిత్రీకరించినట్లు కళాకారుడు తెలిపారు. ఇది వరకు జాతీయ పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా పలు చిత్రాలను గీసిన హర్షవర్ధన్ రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు.
News September 7, 2024
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కల్లూరులో అత్యధికంగా 25.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్నూలు అర్బన్‌లో 22.4 మి.మీ, కర్నూలు రూరల్ 21.8, గూడూరు 13.2, ఓర్వకల్ 9, నందవరం 8.6, కౌతాలం 8.4, సి.బెలగల్‌లో 7.8 మి.మీ వర్షం కురిసిందని వివరించారు.
News September 7, 2024
మానవత్వం చాటుకున్న MLA భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ వరద బాధితుల పట్ల మానవత్వం చాటుకున్నారు. భూమా శోభానాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా 1,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో పాటుగా అటు సీఎం సహాయ నిధి (CMRF)కు రూ.13.50 లక్షల చెక్కును శుక్రవారం CM చంద్రబాబుకు అందజేశారు. ప్రజల కష్టాలు చూసి గుండె తరుక్కుపోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు.