News February 17, 2025

కుంభమేళాకి వెళ్లి తాడిపత్రి మహిళ మృతి

image

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భక్తులు మహా కుంభమేళాకు వెళ్లిన బస్సు వారణాశికి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. చేనేత కాలనీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా 6 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే యాత్రకు వెళ్లిన కొంతమంది ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Similar News

News October 24, 2025

చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

image

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్‌ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.

News October 24, 2025

తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

image

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.

News October 24, 2025

ఖమ్మం: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

image

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న తాటి గోవర్ధన(32)ను భర్త రామారావు అనుమానించేవాడు. ఈ విషయమై తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విసుగు చెందిన రామారావు గొడ్డలితో భార్యను చంపి, అనంతరం స్థానిక ఠాణాలో లొంగిపోయాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.