News February 7, 2025
కుంభమేళాకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

మహా కుంభమేళ యాత్రకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 8 రోజులు పాటు జరిగే యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం త్రివేణి సంగమం క్షేత్రాలు వెళ్లవచ్చని తెలిపారు.
Similar News
News March 27, 2025
సూర్యాపేట: బైక్ అదుపు తప్పి బాలుడి మృతి

బైక్ అదుపు తప్పి బాలుడు మృతిచెందిన ఘటన నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బొప్పని రిషి (10) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ మహేంద్రనాథ్ తెలిపిన వివరాలు.. పవన్ తన బావమరిది రిషితో కలిసి చిననెమిల క్రాస్ రోడ్ వైపు వెళుతున్నారు. బైక్ అదుపుతప్పడంతో రిషి చనిపోయాడు. బాలుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు పవన్‌పై కేసు నమోదైంది.
News March 27, 2025
వనపర్తి: క్రీడాకారులు, నిర్వాహకులను అభినందించిన ఎస్పీ

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వాహకులను జిల్లా ఎస్పీ గిరిధర్ అభినందించారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుఢ్యం మెరుగుపడుతుండటంతోపాటు, పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News March 27, 2025
సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.