News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News November 22, 2025
HYD: Ibomma రవిని విచారించిన సీపీ

Ibomma రవి కేసులో మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి రవిని విచారించారు. పైరసీ నెట్ వర్క్, బెట్టింగ్ యాప్లతో అతనికున్న సంబంధాలు, విదేశీ కార్యకలాపాల గురించి సీపీ ఆరా తీసినట్లు సమాచారం.
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
ADB: ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ నెల 24న పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన జిల్లాకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లాకు వెళతారు.


