News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News February 18, 2025
KMR: పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం: ఎస్పీ

అత్యవసర విభాగంలో పని చేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో ఇటీవల 189 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్లు చేరారన్నారు. సివిల్ కానిస్టేబుళ్లు 115, ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అత్యవసర పరిస్థితుల్లో డ్రైవింగ్ రావాలనే ఉద్దేశంతో ఆరు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
NGKL: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో గోల్డ్‌మెడల్

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ స్టేట్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి.అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.