News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News October 23, 2025
అద్దంకి ప్రకాశం జిల్లాలో కలవనుందా.?

బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని ప్రకాశం జిల్లాలో తిరిగి విలీనం చేసే అంశంపై సీసీఎల్ఏ ఆధ్వర్యంలో వీక్షణ సమావేశం జరిగింది. అద్దంకి సరిహద్దులపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, విడదీసినప్పటి ప్రభావంపై అధ్యయనం చేయాలని సూచించారు. వర్షాభివృద్ధి హెచ్చరికలు, నీటి-మట్టి పరిశీలనలు, అర్జీల పరిష్కారం, గృహాల కేటాయింపు ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డీఆర్ఓ, కలెక్టర్, ఆల్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
News October 23, 2025
చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777
News October 23, 2025
ఏడో తరగతి అర్హతతో ఉద్యోగాలు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒక సంవత్సరం పాటు తాత్కాలిక నియామకం కోసం నోటిఫికేషన్ ప్రకటించినట్లు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఏడో తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలలోపు కర్నూలు జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలన్నారు.